Opera 11.00 అందుబాటులో ఉంది

Operaను ఇష్టపడడానికి Opera 11.00 పదకొండు కొత్త కారణాలను ప్రవేశపెడుతోంది .

  1. ట్యాబ్ స్టాకింగ్—Opera యొక్క ట్యాబ్ స్టాకింగ్ సామర్ధ్యాలతో ఎన్ని వెబ్ పేజీలనైనా సులభంగా నిర్వహించుకోండి.
  2. మరింత సురక్షితమైన చిరునామా ఫీల్డ్—పొడవైన వెబ్ పేజీల యొక్క సంక్లిష్టతను దాచండి మరియు బ్రౌజింగ్ చేసే సమయంలో సురక్షితంగా ఉండడానికి మద్దతు పొందండి.
  3. ఎక్స్‌టెన్షన్స్—Opera యొక్క ఎక్స్‌టెన్షన్ కేటలాగ్ ద్వారా ఒక సింగిల్ క్లిక్‌తో కొత్త ఫంక్షనాలిటీని జతచేయండి.
  4. విజువల్ మౌస్ గెశ్చర్స్- కేవలం ఒకే మౌస్‌తో ఎన్నో బ్రౌజర్ యాక్షన్లు వేగంగా ఎలా నిర్వహించాలో నేర్చుకోండి.
  5. శోధన సలహాలు—మీ చిరునామా ఫీల్డ్‌లో Google సెర్చ్ ప్రిడిక్షన్స్ వెదకండి మరియు వేగవంతం చేసుకోండి.
  6. మెయిల్ ప్యానెల్ అప్‌గ్రేడ్ —మీరు కోరుకున్న చోటుకి అకౌంట్లు మరియు మెయిల్ ఐటెమ్స్ డ్రాగ్ చేసుకోండి.
  7. ప్లగ్-ఇన్‌లు డిమాండ్ పైన మాత్రమే—ఫ్లాష్ కంటెంట్ వంటి ప్లగ్-ఇన్‌లను క్లిక్ చేసినపుడు మాత్రమే లోడ్ అయ్యేలా చూడండి.
  8. ఉత్తమ పనితీరు—త్వరగా మరిన్ని పేజీలను లోడ్ చేయండి మరియు సంక్లిష్టమైన అప్లికేషన్లను మరింత సున్నితంగా రన్ చేయండి.
  9. మెరుగుపరిచిన HTML5 మద్దతు—సమృద్ధియైన, డైనమిక్ వెబ్ అప్లికేషన్లు మరియు మల్టిప్లయర్ గేములను Opera 11:00 సహాయంతో ఆనందించండి.
  10. వేగంగా ప్రతిష్టాపన —త్వరగా అప్‌డేట్ చేయండి; ఈ మరిన్ని కొత్త ఫీచర్లతో కూడా, Opera 11.00 అనేది Opera 10.60 కంటే 30% చిన్నది.
  11. బుక్‌మార్క్‌ల బార్—కొత్త బుక్‌మార్క్‌ల బార్‌తో మీ బుక్‌మార్క్‌లను సులభంగా యాక్సెస్ చేసేలా చేసుకోండి.

మీకు అప్‌డేట్‌పై మరింత సమాచారం కావాలంటే దయచేసి Opera డెస్క్‌టాప్ చేంజ్‌లాగ్‌లను సందర్శించండి.